SRH vs RCB హైఓల్టేజీ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా
హైదరాబాద్: బ్లాక్ టికెట్ మాఫియా(IPL Ticket Black Marketing Racket ) ఉప్పల్ వేదికగా RCB వర్సెస్ SRH(Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) హైఓల్టేజీ మ్యాచ్‌ను క్యాష్ చేసుకుంటోంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. SRHకు హోంగ్రౌండ్ ఉప్పల్ లో ఇవాళే చివరి మ్యాచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
మ్యాచ్ టికెట్లకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఓ ముఠా బ్లాక్ లో అమ్ముతోంది. రూ.1500 నుంచి రూ. 8 వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియంలో వీవీపీ బాక్స్ టికెట్లకు రూ. లక్షలు చెప్తున్నట్లు సమాచారం. స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ యువకులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. సీపీ సుమతి ఆదేశాలతో బ్లాక్ టికెట్ల విక్రయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్ వోటీ పోలీసులు ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాపై నిఘా పెట్టింది. నలుగురి నుంచి 5 డిజిటల్ టికెట్లను ఎస్ వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకులను ఉప్పల్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్ వోటీ పోలీసులు తెలిపారు.






