22 May, 2026 | 5:15 PM

భాగ్యరెడ్డి వర్మను ఆదర్శంగా తీసుకోవాలి

22-05-2026 04:10 PM

వాంకిడి,(విజయక్రాంతి): భాగ్యరెడ్డి వర్మను ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహూల్కర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో భాగ్యరెడ్డి వర్మ 139 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  అశోక్ మహూల్కర్ మాట్లా డుతూ.. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొట్ట మొదటిగా దళిత ఉద్యమాన్ని నడిపిన తొలిదశ దళిత ఉద్యమ నాయకుడని కొనియాడారు. చదువుకుంటేనే సమాజాన్ని బాగుపరవచ్చని 1906 నుండి 1933 మధ్య కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 26 బాలికల పాఠ శాలలను ఏర్పాటు చేసి దళిత పిల్లలకు విద్యను అందించిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అన్నారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకున్న భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు.