13 July, 2026 | 5:28 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఆల్‌రౌండర్లకు పెద్దపీట

02-05-2024 12:46 AM

వరల్డ్‌కప్ కోసం అఫ్గాన్ జట్టు ప్రకటన

కాబూల్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు ఆల్‌రౌండర్ల బలంతో బరిలోకి దిగనుంది. వచ్చే నెలలో జరగనున్న పొట్టి ప్రపంచకప్‌నకు ప్రాథమిక జట్లను ప్రకటించేందుకు మంగళవారం తుది గడువు కాగా.. అఫ్గాన్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేసింది. ప్రస్తుతం ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది ప్లేయర్లు అఫ్గాన్ వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. మెగాటోర్నీలో అఫ్గాన్ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యం వహించనుండగా.. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, మహమ్మద్ నబీ, ముజీబ్, నవీన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. 

అఫ్గాన్ జట్టు: రషీద్ (కెప్టెన్), రహ్మానుల్లా, ఇబ్రహీం, అజ్మతుల్లా, నజీబుల్లా, ఇషాఖ్, నబీ, నైబ్, కరీమ్, ఖరోటి, ముజీబ్, నూర్, నవీన్, ఫజల్‌హక్, ఫరీద్.