అదే మా లక్ష్యం: ధీరజ్

02-05-2024 12:48:03 AM

న్యూఢిల్లీ: వ్యక్తిగత విభాగంలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్.. టీమ్ విభాగంలోనూ విశ్వక్రీడలకు అర్హత సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన 22 ఏళ్ల ధీరజ్.. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్‌లో పారిస్ టికెట్ దక్కించుకున్నాడు. అయితే.. టీమ్ విభాగంలో కూడా కోటా సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ధీరజ్ అభిప్రాయపడ్డాడు. ‘వ్యక్తిగత కోటా సాధించా. ఇప్పుడు జట్టు విభాగంలోనూ అదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. అందుకే పారిస్ ఒలింపిక్స్‌కు ముందు వీలైనన్ని ఎక్కువ టోర్నీల్లో పాల్గొంటున్నాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం మాత్రమే మన చేతిలో ఉంటుంది’ అని ధీరజ్ అన్నాడు.