17 March, 2026 | 12:23 AM

Breaking News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన   •   ఎమ్మెల్యే ఆఫీస్ పక్కనే అక్రమ కట్టడాలా?   •   9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •  

ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం

16-03-2025 11:44 AM

సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ 

రాజేంద్రనగర్: ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఏటీసీ అధికారులు సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారుల కథనం ప్రకారం... కౌలాలంపూర్ నుంచి 73 మంది ప్రయాణికులతో ఎయిర్ ఏషియా విమానం హైదరాబాద్ బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోకి రాగానే విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే ఈ విషయం గమనించిన పైలెట్ శంషాబాద్ విమానాశ్రయం ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఎయిర్ ఏషియా విమానాన్ని సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.