9 March, 2026 | 7:48 AM

బావమరదలి ప్రేమాయణం.. కొత్త మలుపు

15-01-2026 01:51 AM

‘సర్కార్ నౌకరి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్. తొలి ప్రయత్నంలోనే సందేశాత్మక చిత్రంతో మెప్పించిన ఆయన ఇప్పుడు సరికొత్త ప్రేమకథతో పలుకరించనున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కొత్త మలుపు’. శివవరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. రొమాం టిక్ సస్పెన్స్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో భైరవి అర్థ్యా హీరోయిన్‌గా నటిస్తుండగా రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మేకర్స్ బుధవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లా డుతూ.. “రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తోపాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాశ్, భైరవి జోడీ చక్కగా కుదిరింది. వీరు బావమరదలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల చేస్తాం” అన్నారు. నిర్మాత బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమాను పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణా నంతర పనులు జరుగుతున్నాయి” అని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణులు తదితర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యశ్వంత్; నిర్మాత: తాటి బాలకృష్ణ; దర్శకత్వం: శివ వరప్రసాద్ కేశనకుర్తి.