16 June, 2026 | 7:49 PM

వినాయక దేవాలయంలో నూతన భవనం, ప్రధాన ద్వారం ప్రారంభం

16-06-2026 07:17 PM

నాగోల్,(విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రిపురం కాలనీలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో నూతన భవనం మరియు ప్రధాన ద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని నూతన భవనం, ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకోటి పవన్ కుమార్ మాట్లాడుతూ భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, దాతలను అభినందించారు. గాయత్రిపురం కాలనీ ప్రజలు ఐకమత్యంతో దేవాలయ అభివృద్ధికి సహకరించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్, వెంకట్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.