calender_icon.png 17 January, 2026 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే మకాం మారుస్తున్నా!

15-01-2026 01:53:37 AM

‘నా బాల్యం నుంచే హీరోయిన్ కావాలని కలగనేదాన్ని. అనుకున్న కెరీర్‌నే ప్రస్తుతం కొనసాగిస్తున్నాను కాబట్టి కొత్తగా కోరేదేదీ లేదు. పర్పస్‌ఫుల్ ప్రాజెక్టులు చేయాలని ఆశిస్తున్నా’ అంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఇటీవల ప్రభాస్ ‘రాజాసాబ్’తో ప్రేక్షకులను పలుకరించిందీ అందాల నిధి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం సగటు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. సినిమా ఫలితం మాట అటుంచితే.. ఈ ప్రాజెక్టులో భాగం కావటం పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని చెప్తోంది నిధి. తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ నిధి చెప్పిన విశేషాలివీ.. “హరి హర వీరమల్లు’తోపాటే ఈ షూటింగూ చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్, నిద్ర ఉండకపోయేది.

ఈ మూవీలోని విజువల్ ఎఫెక్టులున్న సీన్లలో యాక్టింగ్ కరెక్ట్‌గా చేసేందుకు టైమ్ పట్టేది. లుక్ ఎక్కడ ఇవ్వాలి, లేనివి ఉన్నట్లు ఊహించుకుని రియాక్ట్ కావాలి.. ఇలాంటివి కొన్ని సీన్స్ చేశాక ఈజీ అయింది. హారర్ మూవీస్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ కొన్ని అనూహ్య ఘటనలు జరగడం చూశామని చెప్తుంటారు. మాకు అలాంటివేం ఎదురుకాలేదు. నిజానికి నాకు దెయ్యాలు, హారర్ కంటెంట్ అంటే భయం. రాత్రి నిద్రపోయేప్పుడు లైట్స్ వేసుకుని హనుమాన్ చాలీసా లూప్‌లో వింటూ నిద్రపోతా. నేనూ టాలీవుడ్డే. ఇటీవల ముంబై వెళ్లినప్పుడు.. తెలుగు సినిమాలు ఎంత క్వాలిటీగా, ఎంత పెద్ద స్కేల్‌లో వస్తున్నా యో నార్త్ వాళ్లు చెప్తుంటే విన్నా. సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని కోరుకున్నా. మనమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం. ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నా. ఇక్కడికి షిప్ట్ అవుతున్నా” అని తెలిపింది.