calender_icon.png 15 January, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకేశ్ దర్శకత్వంలో.. 23వ సినిమా

15-01-2026 01:49:47 AM

అల్లు అర్జున్ హీరో గా బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబో తోంది. టాలీవుడ్‌కు చెందిన మైత్రీ మూవీ మేకర్స్, బీవీ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ బుధవారం ఓ ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా వెల్లడించారు. ‘ఏఏ23’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారట డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా కాగా బన్నీవాస్, నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమా షూటింగ్ ఇదే ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.