13 May, 2026 | 11:13 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

అక్బర్ పరీక్ష

04-01-2025 12:00 AM

ఒకసారి బీర్బల్‌కు బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్లలేదు. అక్బర్‌కు, బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ని చూడటానికి అతని ఇంటికి వెళ్లారు. 

బీర్బల్ జ్వరం వల్ల నీరశించి, చిక్కిశైల్యం అయ్యి ఉన్నాడు. అక్బర్‌కు అతని అవగాహనా శక్తులు తగ్గాయేమో అని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ల కోసం పక్క గదిలోకి వెళ్లినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు. 

తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే యేదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. 

అక్బర్ యేమి యెరగనట్టు బీర్బల్‌తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు. కొంతా సేపు ఇలా సాగాక, అక్బర్ బీర్బల్  పరధ్యానానికి కారణం యేమిటని అడిగాడు. 

‘ఈ గదిలో యేదో మారినట్టుంది’ అని బీర్బల్ జవాబు చెప్పాడు.

‘మారిందా? యేమిటి మారిందంటావు?’ అని అక్బర్ అన్నారు. 

‘ఈ మంచం ఒక మూల యెత్తుగా ఉన్నట్టుంది’ అని అన్నాడు.

‘జ్వరమొచ్చినప్పుడు అలా అనిపిస్తుంది’ అని అక్బర్ జాలి ముఖం పెట్టి అన్నాడు. 

‘మహారాజా.. నా శరీరానికి జ్వరమొచ్చింది కాని నా మెదడుకు రాలేదు’! అని బీర్బల్ నవ్వుతూ అక్బర్‌తో అన్నాడు. అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్‌కు పెట్టిన పరీక్ష గురించి చెప్పారు. 

---- వర్డ్‌ప్రెస్.కాం సౌజన్యంతో