4 July, 2026 | 12:39 AM

ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు

13-05-2026 09:02 PM

పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్న నిందితుడు అరెస్ట్ - రిమాండ్

అక్కన్నపేట ఎస్సై చాతరాజు ప్రశాంత్

హుస్నాబాద్: అక్కన్నపేట మండల పరిధిలో ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఉస్తేం ప్రవీణ్ (22) అనే యువకుడు, అక్కన్నపేట మండలం బొడిగెపల్లికి చెందిన ఓ యువతితో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ నమ్మకంతో బాధితురాలిని శారీరకంగా లొంగదీసుకున్న అనంతరం, పెళ్లి విషయానికి వచ్చేసరికి ముఖం చాటేశాడని అక్కన్నపేట ఎస్సై చాతరాజు ప్రశాంత్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి  పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.