22 August, 2026 | 9:22 PM

ఆలరించిన అఖండ జ్యోతి కార్యక్రమం

22-08-2026 06:28 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహిస్తున్న శబరిమత అఖండ జ్యోతి కార్యక్రమం శనివారం కన్నుల పండుగగా కొనసాగింది. జిల్లాలో నలుమూలల నుండి వచ్చిన మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆడి పాడారు. శ్రీకాంత్ ఆర్కెస్ట్రా బృందం వారు పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తుల రాకతో కనుగుట్ట గ్రామం జన సంద్రంగా మారింది.