కొత్తగూడెం ప్రెస్ క్లబ్‌లో షోయబుల్లా ఖాన్ వర్ధంతి వేడుకలు
22-08-2026 | 08:30pm
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు, అమరుడు షాయబుల్లా ఖాన్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో షాయబుల్లా ఖాన్ చిత్రపటానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ,ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తేవడం లో షాయబుల్లా ఖాన్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పాత్రికేయ రంగంలో ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత నేటి జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను నిర్భయంగా, వెల్లడించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.






