22 August, 2026 | 9:45 PM

వైన్స్ షాపులో చోరీ

22-08-2026 08:39 PM

మద్యం, నగదు అపహరణ

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లిలోని రిషిత -1 వైన్స్ షాప్ లో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1:25 గంటల సమయంలో షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీ జరిగినట్లు తెలిసింది.ఇద్దరు దుండగులు దుకాణంలోకి చొరబడి నగదు,మద్యం అపహరించినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఉదయం వైన్స్ సమీపంలోని వారు షెట్టర్ లేపి ఉండడాన్ని గమనించి వైన్స్ యజమానికి సమాచారం అందించారు. వెంటనే అతను పోలీసులకు తెలుపగా ఎస్సై మధు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా ఈ ఘటనలో రూ.35వేల నగదు, 20 వేల విలువైన మద్యం చోరికి గురైనట్లు వైన్స్ యజమాని మట్టిపల్లి సుధాకర్ తెలిపారు. ఇట్టి విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.