4 July, 2026 | 3:04 AM

కోదాడ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలసకాని శరబేశ్వరరావు

04-07-2026 01:53 AM

కోదాడ, జూలై 3: కోదాడ రూరల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అలసకాని శరబేశ్వరరావును తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో ఈ పదవిలో తూమాటి వరప్రసాద్ రెడ్డి కొనసాగగా, తాజాగా ఆయన స్థానంలో అలసకాని శరబేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యకు అలసకాని శరబేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.