15 June, 2026 | 7:55 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

03-06-2026 03:03 PM

సీఎం ఇంటిముందు కూర్చొంటాం: ఏలేటి

హైదరాబాద్: రేవంత్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి(Revanth Reddy resignation) పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Aleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో  కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏలేటి ఆరోపించారు. 60 శాతం వరి ధాన్యాన్ని తెలంగాణ నుంచే కేంద్రం ప్రభుత్వం కొంటోందని తెలిపారు. చివరి గింజ వరకు కొనపోతే సీఎం ఇంటి ముందు కూర్చొంటామని హెచ్చరించారు.

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి సతమతమవుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల ఘనతను తమ ఖాతాలో వేసుకుంటూ, ఆడంబరమైన భారీ ప్రాజెక్టుల ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ రెడ్డి నిజంగానే తెలంగాణకు ముఖ్యమంత్రిగా అవసరమా? రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు మీడియా ద్వారా డిమాండ్ చేశారు.