3 June, 2026 | 4:01 PM

తెలంగాణ—దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాలు మరింత ముందుకు

03-06-2026 03:14 PM

MCRHRDలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు 

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్(South Africa Vice President Palas Mashatil) బృందం MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ(Damodara Rajanarasimha), సీఎస్ రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ—దక్షిణాఫ్రికా(Telangana—South Africa) వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు పక్షాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా బృందం హైదరాబాద్ వచ్చింది.