27 July, 2026 | 10:57 AM

సమాజ మానసిక ఆరోగ్య పరిరక్షణలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం

27-07-2026 10:19 AM

టి.పి.ఏ రాష్ట్ర అధ్యక్షులు డా. మోతుకూరి రాంచందర్

మారుతున్న సామాజిక పరిస్థితులు, ఉరుకుల పరుగుల జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆందోళనలు, మానసిక సమస్యల నేపథ్యంలో సమాజాన్ని మానసిక సంక్షోభం నుంచి కాపాడే బాధ్య త సైకాలజిస్టులపై మరింత పెరిగిందని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్(Telangana Psychologists Association) రాష్ట్ర అధ్యక్షులు డా. మోతుకూరి రాంచందర్ పేర్కొన్నారు. ఆదివారం నేరేడ్మెట్ లోని హెలెన్ కెల్లర్ ఇన్ స్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన భారతీయ మనస్తత్వ శాస్త్ర దినోత్సవం (Indian Psychology Day) వేడుకల్లో ఆయన ముఖ్య అతిథఇగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా డా. రాంచందర్ మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో మానసిక ప్రశాంతతను పొందడం ప్రతి ఒక్కరికీ సవాలుగా మారిందన్నారు. యోగ, ధ్యానం, భారతీయ మనస్తత్వ శాస్త్రం వంటి సంప్రదాయ విజ్ఞాన విధానాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విశేషంగా దోహదపడతాయని తెలిపారు. భారతీయ మనస్తత్వ శాస్త్ర దినోత్సవం ద్వారా ఈ విలువలను ప్రజలకు చేరవేయడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని.. వ్యాస పూర్ణిమ(గురు పౌర్ణిమ)గా జరుపుకుంటామని, మానవాళికి వేదాలను అందించిన ఆదిగురువు మహర్షి వేదవ్యాసుని జయంతిని ఈ రోజు స్మరించుకుంటామని తెలిపారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువుల పట్ల కృతజ్ఞాతాభావాన్ని వ్యక్తం చేసే పవిత్రమైన దినంగా గురుపౌర్ణిమ విశిష్ట స్థానం ఉందన్నారు.

సైకాలజిస్టులు కాలానుగుణంగా తమ వృత్తి పరమైన నైపుణ్యాలను నిరంతరం అఫ్ స్కిల్ (Upskilling) చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కృత్రిమ మేద(Artificial Intelligence – AI) వంటి ఆధునిక సాంకేతికతను సంప్రదాయ కౌన్సిలింగ్  విధానాలతో సమన్వయం చేస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన మానసిక ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్  రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత, ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, వందలాది మంది సైకాలజిస్టులు,కౌన్సెలర్లను తీర్చిదిద్దిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు టి.పి.ఏ ప్రోత్సాహం అందించిందని, కౌన్సిలింగ్ రంగాన్ని సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్తున్న సంస్థగా టీపీఏ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సంఘ ఉపాధ్యక్షులు లయన్ డా. ఉమర్ ఖాన్ మాట్లుడుతూ, "ఒక సమాజం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం శారీరక ఆరోగ్యం సరిపోదు. మానసికంగా దృఢమైన పౌరులే అభివృద్ధికి బలమైన పునాది. ఆ పునాదిని నిర్మించి, పరిరక్షించే బాధ్యత సైకాలజిస్టులపై ఉంది" అన్న ఆయన అన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సామాజిక ప్రయోజనకర కార్యక్రమాల వార్షిక కార్యాచరణ ప్రణాళికను (Annual Activity Schedule) విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి సైకాలజిస్ట్ సమాజానికి జవాబుదారీతనంతో సేవలందిస్తూ, వృత్తి గౌరవం మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సైకాలజీ రంగంలో విషిష్ట సేవ సేవలందించిన  సైకాలజిస్ట్స్ లను సంఘ పక్షాన సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు ఏ. సుధాకర్, రాష్ట్ర కోశాధికారి డా. శ్రీపూజ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు శ్రీదేవి చెరువు, వైదేహి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాజు ఆచార్య, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం. కృష్ణ సాహితి, నాయకులు శ్రీధర్ సునయన, సోనాలి, కిరణ్మయి, మేఘమాల తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి టి.పి.ఏ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

డా. మోతుకూరి రాంచందర్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (TPA)