అలియాస్ రుక్మిణి జోరు
ప్రేక్షకాదరణ పొందిన ‘కోర్ట్’ సినిమా తర్వాత స్టార్ హీరో నాని సమర్పణలో నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’(alias Rukmini). తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం (Director Muralikant Devasoth)వహిస్తున్నారు. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ చాలా యూని క్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీ తాజాగా 10 రోజుల మొదటి షెడ్యూ ల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షూట్‌లో హీరో నితిన్‌తోపాటు సాయికుమార్, హర్షవర్ధన్, ఇతర నటులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి జోమోన్ టీ జాన్ ఐఎస్‌సీ డీవోపీ కాగా, విజయ్ బల్గానిన్ సంగీతం సమకూర్చతున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.