తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సర్వమత ప్రార్థనలు
మంథని (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(Telangana Activists Forum) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం మంథనిలో సర్వమత ప్రార్థనలో భాగంగా మంథని పట్టణంలోని బేతేలు సర్వమత ప్రార్ధనల మందిరంలో మంథని డివిజన్ కన్వీనర్ గోగుల రాజిరెడ్డి(Convener Gogula Rajireddy) అధ్యక్షతన ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. మొదటగా జామా మసీదులో ప్రార్థనలు చేసిన అనంతరం బేతేలు చర్చి పాస్టర్ నత నీయల్ తో కలిసి ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్, మంథని మండల అధ్యక్షులు కాసిపేట సాంబయ్య, ముత్తారం మండలం అధ్యక్షులు బండారి సుధాకర్, కమాన్ పూర్ మండలం అధ్యక్షులు దాసరి రామస్వామి, మంథని మండల కోశాధికారి నామని ప్రదీప్, మంథని కార్యవర్గ సభ్యులు రోడ్డ లింగయ్య, చందుపట్ల ప్రతాపరెడ్డి, ఎండి సర్వర్, మంథని మండల ఉపాధ్యక్షులు కండెల సమ్మయ్య, జామా మసీద్ మంథని అధ్యక్షులు ఎండి ఫయాజ్, ఉపాధ్యక్షులు కాజా నాసర్, ఉద్యమకారులు పాల్గొన్నారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రార్థనలు చేశారు.






