ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట
మఠంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం మంగళవారం మఠంపల్లి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో ర్యాలీ నిర్వహించారు. కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా గ్రామాలలో అంగన్వాడీ సూపర్వైజర్ నిర్మల పాల్గొని మాట్లాడారు. జూన్ 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఈ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ మూడు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపాలని, బాలింతలు, గర్భిణీ స్త్రీలు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సంతోషి కుమారి, రాజ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ బానోతు విజయ, కార్యదర్శి నరేష్, సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






