22 May, 2026 | 3:40 PM

Breaking News

మార్కెట్లో నిండుకున్న జొన్న మొక్కజొన్న పంట   •   బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం   •   శ్రీ కృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు   •   దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం   •   ఎండిన వాగుకు జీవం పోస్తున్న చెక్ డ్యాములు   •   అడ్మిషన్ లు ప్రారంభం.. విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే   •   భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు   •   మక్కలు వెంటనే తరలించాలని తహసీల్దార్ కు వినతి   •  

విజయ్‌కి శుభాకాంక్షలు

28-10-2024 12:00 AM

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి

చెన్నై, అక్టోబర్ 27: తమిళనాడు అగ్రహీరో విజయ్ దలపతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన పార్టీ పేరును తమిళక వెట్రి కజగం(టీవీకే)గా ప్రకటిచండమే కాకుండా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఆదివారం మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్‌ను నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.

ఈ నేపథ్యంలో సినిమా రంగం వైపు నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్న విజయ్‌కి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉధయనిధి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయ్ నాకు చాలా సంవత్సరాలుగా మిత్రుడు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.

నూతన రంగంలో ఆయన విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఉధనిధి  స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయంలో పార్టీ సిద్ధాంతంతోపాటు ప్రజల అంగీకారం కీలక భూమిక పోషిస్తాయని ఆయన సూచించారు. తమిళనాడులోని విల్లుపురమ్ జిల్లా విక్రవండి ప్రాంతంలో జరిగే టీవీకే రాష్టస్థాయి సమావేశాన్ని రాష్ట్రంలోని అని రాజకీయ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి.