30 July, 2026 | 2:22 AM

సమన్వయంతో ముందుకెళ్లాలి

30-07-2026 01:32 AM

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి 

  1. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధత 
  2. స్థానిక ఎన్నికలకు కార్యాచరణ 
  3. ‘సర్’ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ
  4. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వాయిదాకు కారణం?
  5. టీపీసీసీ సమావేశంలో కీలక చర్చ
  6. తుంగతుర్తి పంచాయితీపై అధిష్ఠానం సీరియస్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ర్టంలో పార్టీ బలోపే తం, ప్రభుత్వ-ం, పార్టీ మధ్య సమన్వయం, రానున్న ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, పెం డింగ్‌లో ఉన్న సంస్థాగత విషయాలు, తుంగతుర్తి నియోజకవర్గం పం చాయితీపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సమన్వయ సమావేశం (టీపీసీ సీ) కీలకంగా చర్చించింది.

వీటితోపాటు సర్ ప్రక్రియ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, నామినేటెడ్ పోస్టులతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైన చర్చ జరిగినట్టు సమాచారం. కాం గ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో టీపీసీసీ సమన్వ య కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర్ రాజానర్సింహ, వంశీ చంద్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో సర్’ ప్రక్రియ, పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.

కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ పనితీరు, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రజలకు చేరువ చేసే కార్యాచరణపై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సం స్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

తుంగతుర్తి పంచాయితీపై అధిష్టానం సీరియస్..

ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతురి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి వివరించినట్లుగా తెలిసింది. ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన కామెంట్స్‌కు ప్రతిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యే సామేలు చేసిన ప్రతి విమర్శలు పార్టీకి తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లుగా తెలిసింది.

డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే రాంచంద్రనాయక్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన తర్వాత ఎందుకు ప్రమాణస్వీకారం చేయించలేదని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆరా తీశారని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పదవీకి మరో వ్యక్తి పేరు ప్రతిపాదించాలని, అందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కలిసి నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

ఇక హైదరాబాద్ మహబూబ్‌నగర్ నల్లగొండ  పట్టభద్రులకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ ఎన్నికలపైన ప్రత్యేకం గా ఫోకస్ పెట్టాలని, అందుకు పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది.

వచ్చే మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్నింటిలో విజయం సాధించాలని, అందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.  ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు పార్టీ పదవులు, టీ పీసీసీ వర్కింగ్ పోస్టులను కూడా సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత భర్తీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.