30 July, 2026 | 1:46 AM

మూడు బరాజ్‌ల టెస్టింగ్

30-07-2026 01:13 AM
  1. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే ముందుకు..
  2. కాపర్‌డ్యాంపై నిపుణులదే తుది నిర్ణయం
  3. కాళేశ్వరంపై రేపు కీలక సమీక్ష
  4. ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పాలమూరును పూర్తిచేసి తీరుతాం  
  5. ఢిల్లీలో మీడియాతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌ల సామర్థ్య పరీక్ష లు నిర్వహిస్తున్నామని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై ఈనెల 31న  కీల క సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

కేంద్ర జలసంభం (సీడబ్ల్యూసీ), తెలం గాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లను పరీక్షిస్తున్నామని, ఐఐటీ బాంబే, ఆఫ్రో ఇండియాతో కలిసి రిహాబిలిటేషన్ డిజైన్ల పనులు పూర్తిచేస్తామని మంత్రి తెలి పారు. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించేందుకు అన్ని ప్ర యత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.  

నాసిరకం డిజైన్‌తోనే కాళేశ్వరం సమస్య

కాళేశ్వరం సమస్యలకు గత ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణమని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. నాసిరకం డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. మట్టి న మూనాలపై సరైన పరీక్షలు నిర్వహించకుండా ఇసుక నేలపైనే పునాదులు వేశారని ఆరోపించారు.  కొద్దికాలానికే లీకేజీలు వచ్చాయని, ఈ విషయం కేసీఆర్‌కు సైతం తెలుసన్నారు. తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సహా అధికారులు సూచించి నా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.

గత మూడేళ్లుగా నిరూపయోగంగా ఉన్న ప్రాజెక్టుకు రూ. 16 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ కంటే తెలివైన మేధావులు తమకు సలహాలు ఇస్తున్నారని చె ప్పారు. కాళేశ్వరంపై ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. గేట్లు ఎత్తిపెట్టి ఫ్రీ ఫ్లోగా ఉండాలనే విషయాన్ని ఎన్డీఎస్‌ఏ అధికారులు స్పష్టం చేశారని తెలిపారు.  కాపర్ డ్యాం కట్టాలా, వద్దా అని ఎన్డీఎస్‌ఏ అధికారుల సలహా ప్రకారమే నడుచుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

కాళేశ్వరంపై కేటీఆర్ మా ట్లాడటం సిగ్గు చేటన్నారు. బరాజ్‌లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని ఓపెన్ చేస్తే ప్రజలకు ఏమైనా జరిగే ప్రమాదం ఉంద ని, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని  మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరంపై బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారమంతా బూటకమన్నారు.

మేడిగడ్డ బరాజ్ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ 18 కిలో మీటర్ల దూరం ఉం దని, అన్నారం బరాజ్‌కు రంధ్రాలు ఉన్నాయ ని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని, ఎన్‌డీఎస్‌ఏ మొదట ప్రిలిమినరీ నివేదికను నవంబర్ 23న ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణకు ఇస్తే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య బంధం ఉందన్నారు.  

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితనే చెప్పారు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితనే స్వయంగా చెప్పారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు రూ. 1,400 కోట్లు చెక్ రూపంలో బీఆర్‌ఎస్‌కు ఇచ్చారని కవిత చెప్పడం వాస్తవమన్నారు. తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తామని మంత్రి హెచ్చరించారు.  తమ ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తుందని, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులను తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.

హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిధిలోనే ఉందని, దానిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నందున, సీఎం మాట్లాడిన తర్వాత తాను స్పందించడం సముచితం కాదని చెప్పారు. తెలంగాణలో ధాన్యం కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మం త్రి హెచ్చరించారు.