17 July, 2026 | 9:00 PM

Breaking News

రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •  

రోగుల సేవలకు మరింత బలం

17-07-2026 09:00 PM

జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు 69 మంది స్టాఫ్ నర్సుల కేటాయింపు

జిల్లా కలెక్టర్  డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ల కృతజ్ఞతలు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోని అన్ని ఆసుపత్రులు గత కొన్ని సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. నర్సుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో  నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందనీ డిసిహెచ్ఎస్ రవిబాబు తెలిపారు.

మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, ఇటీవలే ఇచ్చిన రెగ్యులర్ నర్సుల రిక్రూట్మెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు మొత్తం 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించిందన్నారు.  ఈ నిర్ణయం జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవడంతో పాటు, ఆసుపత్రుల్లో నర్సింగ్ సేవలను గణనీయంగా బలోపేతం అవుతుందన్నారు. 

 ప్రతిపాదనకు సానుకూల స్పందన తెలిపి జిల్లాకు 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించిన రాష్ట్ర గౌరవ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్తుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డా.జి.రవి బాబు, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ప్రతినిధి డా. వీరబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్లు ఫ్లోరెన్స్ పద్మ, భారతి, రేవతి, జయ, ఝాన్సీ, ఆశా వర్ధిని, శ్రీమతి శారద, సీత, రాధాకుమారి పాల్గొన్నారు.