భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం
* ఉరి వేసుకుని ఆత్మహత్య
పాపన్నపేట: భార్య కాపురానికి రానని నిరాకరించడంతో మనస్థాపం చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అర్కెల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిట్యాల ఉదయ్ కుమార్(23) హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. హైదరాబాద్ ఉన్న సమయంలో పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన రాధను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది.
దీంతో అప్పటి నుంచి అతను గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఈనెల 15న భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి వెళ్లగా ఆమె కాపురానికి రాను అని నిరాకరించింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఉదయ్ కుమార్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.






