పూర్వ విద్యార్థుల సమ్మేళనం
హనుమకొండ (విజయక్రాంతి): స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెంటల్ స్కూల్, జూనియర్ కాలేజ్(Telangana Social Welfare Residential School And Junior College)లో 2003-04 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 22 సంవత్సరాల క్రితం పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా కలుసుకున్నారు.
చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన స్కూల్ ప్రిన్సిపల్ కృతమూర్తి, ఇతర ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కమల్ హాసన్, పెండెం నాగేష్, జన్ను మోహన్, సిరిమల్లె అశోక్, తిలక్, శేషు బాబు, పొనకంటి సతీష్, శ్రీనివాస్, ఏడేల్లి మధు, జీలుకర కిరణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.






