రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి
14-04-2026 08:16 PM
మోతె,(విజయక్రాంతి): రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తహసీల్దార్ ఎం.వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చాలని ఉన్నత లక్ష్యంగా పయనించాలని కోరారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.






