30 June, 2026 | 8:40 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి

14-04-2026 08:13 PM

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ 

అచ్చంపేట: నియోజకవర్గంలోని క్రైస్తవులు.. పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని శాలెం ఎంబి చర్చి ఆవరణలో నియోజకవర్గంలోని నూతన పాస్టర్ల కమిటీని సన్మానించారు. అచ్చంపేట క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలోని క్రైస్తవులు పాస్టర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా వారికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.

వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని వారు ఏ రాత్రి అయిన  సమస్యల కోసం తమ వద్దకు రావచ్చునని అన్నారు. నియోజకవర్గంలోని చర్చిల నిర్మాణం పాస్టర్లకు ఇందిరమ్మ ఇండ్లు తోపాటు అన్ని ప్రభుత్వ పథకాలలో అవకాశం కల్పిస్తామని అన్నారు. ప్రస్తుత కమిటీ ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని వారి ఆధ్వర్యంలోని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. పాస్టర్లు క్రైస్తవులు ప్రభుత్వమే ఈ ప్రభుత్వానికి వారి సహకారం దీవెనలు ఎప్పటికీ ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాస్టర్ల కమిటీని ఘనంగా సన్మానించారు అదేవిధంగా పాస్టర్ల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు.