17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

14-04-2025 06:51 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని సోమవారం ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. పాల్వంచ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో కొత్తగూడెం సూపరిండెంట్ ఇంజనీర్ మహేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పాల్వంచ సబ్ డివిజన్ ఆఫీసులో ఏర్పాటుచేసిన సభ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సబ్ డివిజన్ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొత్తగూడెంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లోని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి  డివిజన్ ఇంజనీర్, ఏడీలు రాంప్రసాద్, మధు బాబు, ఉమారావు, సర్కిల్ ఏఈలు, జే వోలు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.