ఉత్సాహంగా ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్
హైదరాబాద్, మే 16 : యువ రైడర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్(హెచ్‌పీఆర్‌సీ) నిర్వహిస్తున్న ఈ క్వెస్ట్రియన్ ఛాలెంజ్ 2026 పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. అండర్ 10, అం డర్ 12, అండర్ 16, జూనియర్స్ కేటగిరీల్లో చిన్నారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. పలు కేటగిరీల్లో హెచ్‌పీఆర్‌సీకి చెందిన రైడర్లు ఆధిపత్యం కనబరిచారు.
అండర్ 10 హ్యాక్స్‌లో జోహా ఫయాజ్(హెచ్‌పీఆర్‌సీ) మొదటి స్థానంలోనూ, రియా బరెట్టా(హెచ్‌పీఆర్‌సీ) రెండో స్థానంలోనూ, రియా అజీ రా(హెచ్‌పీఆర్‌సీ) మూడో స్థానంలోనూ ని లిచారు. అండర్ 12 హ్యాక్స్‌లో అనన్య గుప్తా(హెచ్‌పీఆర్‌సీ), లెహక్ మెహతా(రాయల్ కా బెల్లో క్లబ్), నీల్ సిన్హా(హెచ్‌పీఆర్‌సీ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. హ్యా క్స్ 13 ఏళ్ల కేటగిరీలో ధన్వి చెరువు( ఫ్లుయింగ్ సీ స్టాలోన్), ఆరుష్ రెడ్డి(హెచ్‌పీఆ ర్‌సీ), మేధా రెడ్డి(హెచ్‌పీఆర్‌సీ) వరుసగా తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నా రు.
యువరాజ్ రోహిత్ గుప్తా (హెచ్‌పీఆర్‌సీ) నాలుగో స్థానంలో నిలిచాడు. డ్రెస్సేజ్ చిల్డ్రన్ 2 కేటగిరీలో హెచ్‌పీఆర్‌సీకి చెందిన సంయుక్త లక్ష్మి వానపల్లి స్వర్ణం సాధించగా.. టియా మాల్పాని రెండో స్థానంలో నిలిచారు. చిల్డ్రన్ 1 విభాగంలో అక్షజ్ రెడ్డి(హె చ్‌పీఆర్‌సీ), నిధి కటికనేని(హెచ్‌పీఆర్‌సీ)తొలి రెండు స్థానాలను సొంతం చేసుకున్నా రు. డ్రెస్సేజ్ జూనియర్స్ విభాగంలో గౌత మ్ సంజయ్ సుజనాని(హెచ్‌పీఆర్‌సీ) అగ్రస్థానంలో నిలవగా.. ఆరుష్ రెడ్డి(హెచ్‌పీఆ ర్‌సీ), శ్రావ్యారెడ్డి (హెచ్‌పీఆర్‌సీ) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
తెలంగాణలో ఈక్వెస్ట్రియన్‌కు మరింత ప్రోత్సాహం, ఆదరణ పెంచే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహి స్తున్నట్టు హెచ్‌పీఆర్‌సీ ప్రెసిడెంట్ చైతన్య చె ప్పారు. గ్రాస్‌రూట్ లెవెల్ నుంచి ఈక్వెస్ట్రియన్‌ను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని సెక్రటరీ రియాజ్ అహ్మద్ తెలిపారు. ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్ లాంటి వేదికపై యువ రై డర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని కితాబిచ్చారు. గత కొంతకాలంగా హెచ్‌పీఆర్‌సీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహి స్తూ రైడర్లను ప్రోత్సహిస్తున్నామన్నారు.






