డెత్‌ సర్టిఫికెట్‌ జారీపై విచారణ జరపాలి

26-09-2026 | 10:04pm

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: టీడీపీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ

ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): బ్రతికున్న వ్యక్తికి డెత్‌ సర్టిఫికెట్‌ జారీ(Death certificate issued) చేసిన ఘటనపై సమగ్ర విచారణ(Comprehensive inquiry) జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ(TDP Illendu Constituency Coordinator Mudragada Vamsi) డిమాండ్ చేశారు. ఇల్లందు పట్టణంలోని(Illandu town) 7వ వార్డుకు చెందిన బొల్లం రాములు జీవించి ఉండగానే డెత్‌ సర్టిఫికెట్‌ జారీ కావడం ఆందోళనకరమన్నారు.

పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమనే ధోరణితో పనిచేస్తున్న దళారీ వ్యవస్థను అరికట్టాలని కోరారు. సంబంధిత వ్యక్తి ప్రమేయం లేకుండానే ఆస్తి బదలాయింపు వంటి వ్యవహారాలు జరగడం బాధాకరమన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని, బాధితుడికి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు