హోమ్ ఓటింగ్ వేసిన వృద్ధుడు
కోటయ్య ఇంటికి వెళ్లి ఓటు వేయించిన అధికారులు
ఈ నెల 8 వరకు హోమ్ ఓటింగ్‌కు అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి) : నగరంలోని అడ్డగుట్ట డాక్టర్ అంబేద్కర్ నగర్‌లో నివాసించే కోటయ్య(85) అనే వృద్ధుడి ఇంటికి వెళ్లి హోమ్ ఓటింగ్ వేయించారు ఎన్నికల అధికారులు. రూట్ ఆఫీసర్ సాయి కిరణ్, ఆశా వర్కర్ కవితలు స్వయంగా కోటయ్య ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. కాగా, ఈ నెల 3న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హోమ్ ఓటింగ్‌ను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ మే 8 వరకు కొనసాగనుంది. జిల్లాలో 129 మంది హోమ్ ఓటింగ్‌కు నమోదు చేసుకోగా.. అందులో సీనియర్ సిటిజెన్లు 86 మంది, దివ్యాంగులు 35 మంది, అత్యవసర సర్వీసుల కింద 8 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.




