బీజేపీ ప్రభుత్వ పాలన దేశానికి ప్రమాదం
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
ఆదిలాబాద్, మే 4 (విజయక్రాంతి): బీజేపీ ప్రభుత్వ పాలన దేశానికి ప్రమాదమని, శాంతియుతంగా ఉన్న ప్రజల మధ్య మత చిచ్చుపెడుతున్నదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. జాగో తెలంగాణ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఓటర్ చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. రాజ్యాం గం, హక్కులు, ప్రజాస్వామ్యాన్ని అపహసం చేస్తున్న రాజకీయ పార్టీలకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయొద్దన్నారు. విద్య, ఉద్యోగ నియమాకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. యాత్రలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకటరమణ, పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ కళావతి, ప్రొఫెసర్లు లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.




