calender_icon.png 1 February, 2026 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షానికి కూలిన పాత మున్సిపల్ కార్యాలయ భవనం

27-07-2024 04:34:45 PM

బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ భవనం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దాటికి కార్యాలయం లోని కొంత భాగం కూలిపోయి నేలమట్టమయింది. భవనంలో కొంత భాగం పూర్తిగా కూలిపోవడంతో చెత్త వేసేందుకు ఉపయోగించే యంత్రాలు కనిపించని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు సత్వరమే స్పందించి కూలిపోయిన గోడలను తొలగించడంతోపాటు కార్యాలయంలో ఉన్న పరికరాలను వస్తువులను వేరే చోటికి తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షం దాటికి కార్యాలయ భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండడంతో స్థానికులను అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది.