calender_icon.png 19 February, 2026 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేషరతుగా షబ్బీర్ అలీకి క్షమాపణ చెప్పాలి

19-02-2026 12:00:00 AM

మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్ 

దోమకొండ , ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని విమర్శించే స్తాయి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డికి లేదని దోమకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల పార్టీ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ  రాజకీయ భిక్ష పెట్టింది షబ్బీర్ అలీ  అని మర్చిపోయిన సంగతి గుర్తు చేశారు.

గతంలో షబ్బీర్ అలీ కౌన్సిలర్గా ,జడ్పిటిసిగా టికెట్లు ఇచ్చిన నాయకుడిని తయారు చేసింది మర్చిపోయావా అని హేళన చేశారు. షబ్బీర్ అలీ రాజకీయాల్లో  మచ్చలేని పేజీ అని అన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

రమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని మరొకసారి షబ్బీర్ అలీపై విమర్శలు చేస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే అని కూడా చూడకుండా బూతు పురాణం మొదలు పెడతామని  తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, జిల్లా కార్యదర్శి తాటిపల్లి శ్రీకాంత్,స్వామి, గోపాల్ రెడ్డి, నల్లపు శ్రీనివాస్, నర్సారెడ్డి, సర్పంచ్ సంజీవ్, నయీమ్ నరేష్ సుధాకర్ మల్లేశం కలీం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.