16 March, 2026 | 9:49 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

నిరుద్యోగి ప్రేమకథ

04-11-2024 01:57 AM

విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న సినిమా ‘ఈసారైనా’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అశ్విని అయలూరు ముఖ్య పాత్రలో నటించింది. ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో విప్లవ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌ని. అన్నిటినీ కష్టమైనా మేనేజ్ చేశా. టీజర్, సాంగ్స్ అన్నీ చూడండి. నచ్చితే, సినిమా చూడండి’ అన్నారు. హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా షూటింగ్ చేస్తున్న రోజులు సమ్మర్ హాలిడేస్‌లాగా అనిపించింది. నా ఫస్ట్ సినిమాకు ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది.

ఇది సినిమా మాత్రమే కాదు, ఒక అనుభవం అని చెప్పొచ్చు’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తేజ్; డీవోపీ: గిరి; సాహిత్యం: గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి; గాయకులు: గోరేటి వెంకన్న, ఎల్‌వీ రేవంత్, పీవీఎన్‌ఎస్ రోహిత్, యశ్వంత్ నాగ్; సహ నిర్మాత: సంకీర్త్ కొండా; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్.