వినోదం గ్యారెంటీ
చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ధూంధాం’. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్న ఈ సినిమాకు గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. ‘నేను శ్రీను వైట్ల దగ్గర వర్క్ చేశా. శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీకి డైరెక్షన్ టీమ్‌ను లీడ్ చేశా. త్రిష హీరోయిన్‌గా నటించిన బృందా సిరీస్‌కు వర్క్ చేశా. ఇలా మూవీస్‌కు వర్క్ చేస్తున్న టైమ్‌లో రైటర్ గోపీమోహన్ ‘ధూంధాం’ ప్రాజెక్ట్ గురించి చెప్పారు.
కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ సినిమా మొదలైంది. పోలాండ్‌లో చిత్రీకరణ జరిపాం. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. ఈ సినిమా మీరు కొనే టికెట్ ధరకు విలువైన వినోదాన్ని గ్యారెంటీగా ఇస్తుంది” అని చెప్పారు.




