11 May, 2026 | 1:11 AM

నాలుగేళ్ల బాలుడి అత్యుత్సాహం.. ముక్కలైన 3500 ఏళ్ల జాడీ

29-08-2024 05:45 PM

టెల్ అవీవ్:  సుపుత్రా కొంప ముంచకు రా అన్నట్లు ఉంది వాడి వ్యవహారం.. పిల్లల అత్యుత్సాహం  ఒక్కొక్కపుడు కొంప ముంచుతుంది. .. ఇజ్రాయిల్ లోని హైఫాలో ఉన్న హెచ్ మ్యూజియంలో కాంస్య యుగానికి చెందిన అనేక కళాఖండాలున్నాయి. వీటిలో చెక్కు చెదరకుండా ఉన్న 3వేల ఏళ్ల నాటి జాడీకి అరుదైన కళాఖండంగా గుర్తింపు ఉంది. ప్రత్యేక ఆకర్షణగా మ్యూజియం ప్రవేశ మార్గంలో ఉంచారు. మ్యూజియం సందర్శనకు అలెక్స్ తన నాలుగేళ్ల కొడుకుతో వచ్చాడు. అంతే ఉత్సాహంతో ఆ బాలుడు జాడీలో ఏముందని తొంగి చూశాడు. దాంతో ఆ 3వేల ఏళ్ల నాటి జాడీ కిందపడి ముక్కలైంది.