నేతన్నకు చేయూత పథకం కింద రూ.90 కోట్లు విడుదల
29-08-2024 07:37 PM
హైదరాబాద్: రాష్ట్రంలోని నేతన్నకు చేయూత పథకం కింద రూ.90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం నేతన్నకు చేయూత కింద బకాయిలు పెట్టిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎలాంటి బకాయిలు లేకుండా నిధులు విడదల చేశామని, గత ప్రభుత్వం నేతన్నలకు చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అని తుమ్మల దుయ్యబట్టారు. నేత కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.






