20 March, 2026 | 10:13 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అనికేత్ అదుర్స్

11-07-2024 12:10 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 3 డే లీగ్ చాంపియన్‌షిప్‌లో యువ స్పిన్నర్ అనికేత్ రెడ్డి ఎనిమిది వికెట్లతో సత్తాచాటాడు. ఏ1 డివిజన్ లీగ్‌లో భాగంగా.. ఎవర్‌గ్రీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ అనికేత్‌రెడ్డి 30 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టడంతో బాలాజీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎవర్‌గ్రీన్ కూడా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైన ఎవర్‌గ్రీన్ రెండో ఇన్నింగ్స్‌లో 45/2తో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో యూబీఐపై స్పోర్టింగ్ ఎలెవన్, ఇండియా సిమెంట్స్‌పై బడ్డింగ్ స్టార్, జిందా తిలిస్మాత్‌పై డెక్కన్ వాండరర్స్ విజయాలు సాధించాయి.