భారత స్పాన్సర్‌గా అదానీ గ్రూప్!

11-07-2024 12:10:00 AM

పారిస్ ఒలింపిక్స్

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత ఆటగాళ్ల బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా అదానీ గ్రూప్ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం స్వయంగా ప్రకటించారు. ఆటగాళ్లకు తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘దేశ్ కా గీత్ ఎట్ ఒలింపిక్స్’ పేరిట అథ్లెట్లకు మద్దతుగా ప్రచారం ప్రారంభించినట్లు అదానీ తెలిపారు. ఇక పారిస్ ఒలింపిక్స్‌కు ఈసారి మన దేశం నుంచి 113 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. జూలై 26 నుంచి విశ్వక్రీడల సంబరం మొదలుకానుంది.