30 June, 2026 | 12:43 PM

సిద్ధిఖీ కేసులో మరొకరి అరెస్టు

18-11-2024 01:38 AM

ముంబై, నవంబర్ 17: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో నిందితుడిని ముంబై క్రైం బ్రాంచి పోలీసులు అరె స్టు చేశారు. మహారాష్ట్రలోని అకోలా కు చెందిన సల్మాన్‌భాయ్ ఇక్బాల్‌ను ఆదివారం అదుపులోకి తీసు కున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్ధి ఖీ హత్య కేసులో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 66 ఏళ్ల ఎన్సీపీ నాయకుడు సిద్ధిఖీ గత నెల అక్టోబర్ 12న బాంద్రాలో తన కుమారుడి కా ర్యాలయానికి వెళ్లినప్పుడు ముగ్గురు దుండగులు  కాల్చి చంపిన విష యం తెలిసిందే. సల్మాన్‌కు సన్నిహి తుడు కావడం వల్లనే హత్య చేసిన ట్లు కొంతమంది పోస్టులు పెట్టారు.