30 June, 2026 | 12:56 PM

టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ బదిలీ

30-06-2026 12:22 PM

టేకులపల్లి ఎస్సైగా తిరుపతి, బోడు ఎస్సైగా రాజమౌళి నియామకం

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి ఎస్సై ఎ. రాజేందర్ బదిలీ అయ్యారు. రాజేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) విఆర్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో మహబూబాబాద్ జిల్లా విఆర్ లో ఉన్న కె. తిరుపతి నియామకమయ్యారు. మండలంలోని బోడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కొత్తగూడెం డి ఎస్ బి లో పనిచేస్తున్న ఎం రాజమౌళి నియమితులయ్యారు. ఇప్పటివరకు బోడు పోలీస్ స్టేషన్ లో పనిచేసిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఇటీవలే బదిలీ అయ్యారు.