మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి
విద్య పైన దృష్టిని సారించండి
డి.ఎస్.పి శ్రీనివాస్ నాయుడు
ప్రభుత్వ కళాశాలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్య పైన దృష్టి సారించి కళాశాలకు తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వివరించారు. ప్రతి విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగి సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంజుల, ఇన్చార్జి ప్రిన్సిపల్ అసాహెల్ ,రూరల్ సీఐ శంకర్,ఎస్సై యాదయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాంబాబు, స్టూడెంట్ కౌన్సిలర్ రాజు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






