21 July, 2026 | 12:01 PM

దద్దరిల్లిన ఢిల్లీ

21-07-2026 02:08 AM

రణరంగంగా సీజేపీ చలో పార్లమెంట్

జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ 

బారికేడ్లు దాటుకుని కదంతొక్కిన నిరసనకారులు

  1. పలుచోట్ల లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగం 
  2. పలువురు విద్యార్థులకు గాయాలు
  3. దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
  4. కేంద్ర మంత్రి అమిత్‌షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

* ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం ఉదయం తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసింది. ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో హస్తిన వీధులు రణరంగాన్ని తలపించాయి. బారికేడ్లను బద్దలు కొట్టుకుని నిరసన కారులు ముందుకు సాగారు.  

* ఆయా చోట్ల పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు యువకులు, విద్యార్థినులు గాయపడ్డారు. నిరసనకారులను చెదర గొట్టేందుకు పోలీసులు ఒక దశలో వాటర్ క్యాన్లు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. 

  1. డిమాండ్లపై కేంద్ర మంత్రి నడ్డా సానుకూల స్పందన
  2. వాంగ్‌చుక్ దీక్ష విరమణ

సీజేపీ డిమాండ్లు

మొదటిది: నీట్ నిర్వహణలో లోపాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి

రెండోది: దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలి. 

మూడోది: పేపర్ లీకేజీలతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. 

* నీట్ లోపాలు, ప్రశ్నాపత్రం లీకేజీ విద్యావ్యవస్థలో వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లేకపోతే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఈ అంశంపై గళమెత్తాలి. ఎంపీలు ఆ హామీ ఇవ్వాలి. రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు కూడా గొంతెత్తాలి. అలా హామీ ఇస్తే నేను నిరాహార దీక్ష విరమిస్తా.

 సోనమ్ వాంగ్‌చుక్, ఉద్యమకారుడు 

* ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. లీకేజీకి పాల్పడిన నిందితులు హాయిగా తిరుగుతుంటే, అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్న విద్యార్థులు మాత్రం లాఠీదెబ్బలు తింటున్నారు. వారిని నేరస్తుల్లా చూడటం సరికాదు. విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటు. 

 రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అగ్రనేత 

    1. పలువురు విద్యార్థులకు గాయాలు
  1. లాఠీఛార్జ్‌పై పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల మండిపాటు
  2. దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
  3. ఇద్దరు సీజేపీ నేతలతో కేంద్ర మంత్రి నడ్డా భేటీ
  4. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ఉద్ఘాటన 
  5. బేషరతుగా వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి
  6. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబానికి కోటి డిమాండ్  
  7. నడ్డా సానుకూల స్పందన... భేటీ తర్వాత వాంగ్‌చుక్ దీక్ష విరమణ

న్యూఢిల్లీ, జూలై ౨౦: ప్రవేశ పరీక్షల్లో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం ఉదయం తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ (చలో సంసద్) ర్యాలీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదంటూ నిరసనకారులను ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు అడ్డుకోవడం హింసకు దారి తీసిం ది. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేయా ల్సి వచ్చింది.

వాటర్ క్యాన్లు, బాష్ప వా యువు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీచార్జిలో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి తీవ్రమైన రక్తస్రావమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే జంతర్ మంతర్ వద్ద మొదలైన ర్యాలీ పార్లమెంట్ వైపునకు సా గింది. భద్రతా బలగాలు ప్రధాన రహదారులను బారికేడ్లతో మూసివేయగా, ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా ఆందోళనకారులు ముందుకు సాగారు. వర్షాన్ని సైతం లెక్క చే యకుండా కదం తొక్కారు.

జంతర్ మంతర్, శాస్త్రీ భవన్, రైల్ భవన్, కాన్సిట్యూషన్ క్లబ్, ఆర్బీఐ కార్యాలయం సమీపంలో నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టుకుని ముం దుకు సాగారు. ఈ క్రమంలో పరిస్థితులు అదుపు తప్పి నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ వారు ఆగపోవడంతో పోలీసులు బాష్పవాయువు గో ళాలు ప్రయోగించారు. తద్వారా నిరసనకారులను చెదరగొట్టారు. పలువురు విద్యా ర్థులనును బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు హెచ్చరికలు లేకుండా తమపై దాడి చేశారని వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి అంగ్మోతోపాటు పలువురు సీజే పీ నేతలు ఆరోపించారు. ర్యాలీలో పాల్గొన్న మెజార్టీ నిరసనకారులల్లో జెన్‌జీ తరమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రదర్శనలో నటులు వామపక్ష నేతలు ఎంఏ బేబీ, బృందా కారత్, డి.రాజా, షబానా అజ్మీ, ప్రకాశ్‌రాజ్, రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

భద్రతా వలయంలో రాజధాని

సీజేపీ ర్యాలీ దృష్ట్యా ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఎక్కడా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. పలు ప్రాంతాల్లో మొ బైల్ కాల్స్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఐదు స్టేషన్లను మూసివేసింది.

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

సీజేపీ నేతల నిరసన తీవ్రతరం కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పం దించారు. ఈమేరకు కేంద్ర విద్యాశాఖ మం త్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనం లోపల వీరి భేటీ జరిగినట్లు సమాచారం. అయితే.. భేటీలో వారు ఏం చర్చించారు అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

వాంగ్‌చుక్ దీక్ష విరమణ

కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయిన తర్వాత, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. దీంతో గత 23 రోజులుగా చేస్తున్న తన దీక్ష ముగిసినట్లయింది. అంతకముందు సోనమ్.. తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చలో పార్లమెంట్ మార్చ్ లో తాను పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ లేఖ విడుదల చేశారు. ఆస్పత్రిలో త నను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. తనను బయటకు పంపించాలని లేఖ ద్వారా ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. 

యువత వ్యతిరేక ప్రధాని: రాహుల్

తమ హక్కుల సాధన కోసం విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నారని, వారిపై బలప్రయోగం అప్రజాస్వామికమని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. విద్యా ర్థులను నేరస్తుల్లా చూడటం సరికాదని హిత వు పలికారు.

దేశ చరిత్రలోనే అత్యంత యు వత వ్యతిరేక ప్రధాని మోదీ అంటూ విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రశ్నిస్తే విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం ఫాసిజమని మండిపడ్డారు. పేపర్ లీకేజీ జరిగి విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరే ధైర్యం ప్రధానికి లేదని దుయ్యబట్టారు. విద్యాసంస్థలు, పాఠ్యాంశాలు ఆర్‌ఎస్‌ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని ఉద్ఘాటించారు. ఆ ఫలితమే ఢిల్లీ వీధుల్లో కనిపిస్తున్న విద్యార్థుల ఆగ్రహమని అభివర్ణించారు.

లాఠీచార్జ్ దారుణం: ఖర్గే

విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై రాజ్యసభ వేదికగా పెద్దల సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభ వేదికగా స్పందించారు. ‘నేను లక్షలాది మంది విద్యార్థుల భవి ష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. వారి హక్కుల కోసం వేలాది మంది పిల్లలు జం తర్ మంతర్ వద్దకు వచ్చారు. శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయినప్పటికీ, ప్రభుత్వం వారిపై కనికరం లేకుండా లాఠీచార్జ్ చేయించింది. మనసులను తీవ్రంగా గాయపరిచింది. విద్యార్థుల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది’ అని మండి పడ్డారు. 

విపక్ష నేతల ఆగ్రహం

విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు గోళాల ప్రయోగంపై విపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై లాఠాచార్జీ దా రుణమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యా దవ్ మండిపడ్డారు. దాడిపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత బిడ్డలను చూ సి భయపడే ప్రభుత్వం ఏ రకమైన పాలన అందించగలదని నిలదీశారు.

ఐదుగురు ఐపీఎస్‌లు సహా 50 మంది పోలీసులకు గాయాలు

నిరసనకారులు తమపై రాళ్లదాడికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు ‘ఎక్స్’ ద్వారా ప్రకటిం చారు. దాడికి పాల్పడిన వారిపై బీఎస్‌ఎస్ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు ఐపీఎస్‌లు సహా ౫౦ మంది పోలీస్, పారామిలటరీ సిబ్బంది గాయాల పాలయ్యారని వెల్లడించారు. అలాగే, ఆందోళన కారులు రెండు బస్సులు, అనేక కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. సీసీ టీవీ ఫుటే జీ, సేకరించిన వీడియోల ఆధారంగా అల్లరి మూకలను గుర్తిస్తామని వెల్లడించారు. పోలీసుల దాడిలో ఏడుగురు నిరసనకారులు మరణించారని, 400 మందికి పైగా క్షతగాత్రులయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి నడ్డాతో సీజేపీ నేతల భేటీ

పార్లమెంట్ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో కేంద్ర ప్రభు త్వం స్పం దించింది. సీజేపీ నేతలతో భేటీ ఏర్పాటు చేసింది. దీనిలో భాగం గా కేంద్ర మంత్రి నడ్డాతో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్‌దాస్, అశు తోశ్ రాంకా భేటీ అయ్యారు. సీజేపీ నేతలు ప్రధానంగా మూడు డిమాండ్లను కోరారు. ఈమేరకు నడ్డాకు విజ్ఞాపన పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి, ఆ డి మాండ్లపై నిర్ణయం తీసుకుంటామని నడ్డా హామీ ఇచ్చారు. సీజేపీ నేతలు, విద్యార్థులు తమ దీక్షను విరమించి, ఢిల్లీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.