ఢిల్లీకి బయలుదేరిన ఏపీ సీఎం
27-12-2024 02:28 PM
హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu) శుక్రవారం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో గురువారం రాత్రి మరణించారు. మాజీ ప్రధానికి నివాళులర్పించిన అనంతరం సాయంత్రంలోగా సీఎం అమరావతికి చేరుకుంటారని ఏపీ సీఎంవో(CMO Andhra Pradesh) ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.






