7 May, 2026 | 6:53 PM

ఏజెన్సీలో అకాల వర్షం.. ఆందోళనలో రైతులు..

07-05-2026 06:15 PM

ఉట్నూర్, మే 7 (విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో  గురువారం సాయంకాలం అకాల వర్షం కురిసింది. అకాల వర్షం కురవడంతో  రబ్బి పంటలలో  జొన్న పంట సాగు చేసిన రైతులు  పంటలు తీసుకునే సమయంలో అకాల వర్షం కురవడంతో  రైతులు ఆందోళన చెందారు. అకాల వర్షం భారీగా కురిస్తే  చేతికొచ్చిన జొన్న పంట తడిసిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని  ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో వర్షం కురిసింది.