7 May, 2026 | 7:07 PM

కొలువుదీరిన సహకార సంఘాల పాలకవర్గాలు

07-05-2026 06:14 PM

కొల్చారం: గతంలో రద్దు అయిన సహకార సంఘాల  పాలకవర్గాలను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మండలంలోని 8  సహకార సంఘాలలో పాలకవర్గాలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రంగంపేటలో సహకార సంఘం అధ్యక్షులుగా తిరిగి అరిగే రమేష్, ఉపాధ్యక్షులుగా మోత్కు మల్లేశం లు బాధ్యతలు స్వీకరించారు. చిన్న గణపుర్ లో అధ్యక్షులుగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి సర్పంచ్ గా ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో  మంద నాగులు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

కిష్టాపూర్ లో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగలగారి మల్లేశం గౌడ్, అంసన్ పల్లి లో మన్నే రాములు, వరిగుంతంలో చిన్నారపు ప్రభాకర్, కొల్చారంలో నాగుల గారి మనోహర్ లు చైర్మన్ లు గా బాధ్యతలు స్వీకరించారు. రంగంపేటలో జరిగిన పాలకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సర్పంచ్ల పురం మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు రవితేజ రెడ్డి, దొడ్లే ఆంజనేయులు, పైమంతపూర్ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, జంగయ్యపేట సర్పంచ్ పుర్ర ప్రభాకర్ తుక్కాపూర్ ఉపసర్పంచ్ రవీందర్, మాజీ సర్పంచ్ రమేష్ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు అల్లు మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సంగాయిపేట మంజీరా రైతు సహకార సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.