కొత్తగూడెంలో కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 9న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని గౌడ భక్తులు తెలిపారు. గురువారం గ్రామంలో విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం జలాధివాసం నిర్వహించారు. 8 వ తేదీన మంగళ హారతులు ,జల బిందెల తో ర్యాలీ, ఆలయం వద్ద హోమాలు, పంచామృతాభిషేకం ,జలాభిషేకo,దీపోత్సవ కార్యక్రమం, కుంకుమ పూజ నిర్వహించబడుతుంది. ఈనెల 9న స్వామివారి కళ్యాణం, ఈనెల 10 న బలి పూజ కార్యక్రమం ఉంటుంది.
ఆలయ నిర్మాణానికి దాతల సహకారం
నూతనంగా నిర్మిస్తున్న ఆలయానికీ గ్రామ సర్పంచ్ మేడ్డుల రమేష్ పదివేల రూపాయల విలువ గలిగిన విద్యుత్ లైట్లను బహుకరించారు. అలాగే పాండవుల విజయేందర్ 5000 రూపాయలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని గౌడ భక్తులు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






